రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ‘‘ఈ పిటిషన్ గురించి మేం మాట్లాడుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని రేపు జాబితాలో ప్రస్తావిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. పిల్‌లో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని కోరారు.