అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400లను భారత్‌కు అందజేయడంలో మరింత జాప్యం చోటు చేసుకొంటుందని రష్యా చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ 2018లో ఐదు ఆర్డర్ చేయగా..2024 తొలి అర్ధభాగంలోనే మొత్తం వ్యవస్థలనూ అందజేయాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఇప్పటివరకు మూడు మాత్రమే చేరుకున్నాయి. మరో రెండు వ్యవస్థలను 2026 మూడో త్రైమాసికం నాటికి అందజేస్తామని రష్యా హామీ ఇచ్చినట్లు సమాచారం.