మన్యం న్యూస్ వాజేడు
ప్రపంచం లోనే అత్యంత భిన్నమైనది ఆదివాసీ సంస్కృతి ,సంప్రదాయాలు అని మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అరెం లచ్చు పటేల్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన వాజేడు మండలంలో నీ పూసూరు గ్రామంలోని గోదావరి నదీ ప్రవాహం ప్రక్కన కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ వన దేవతలను ఆయన దర్శించించు కున్నారు. వన దేవతలను దర్షించించిన ఆయన మానవాళి అంత అంత సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవార్లను వేడుకున్నారు. ఆదివాసీ సంస్కృతి ,సాంప్రదాయాలను ఆదివాసీలు అంతా కాపాడుకోవాలని తెలియజేశారు. ప్రపంచంలోనే ఆదర్శవంతమైన సంస్కృతి ఆదివాసీలది అని కొనియాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా శక్తి వంచన లేకుండా పని చేస్తానని ఆయన ప్రకటించారు. తుడుం దెబ్బ నాయకులు కొప్పుల రవి, పులిష బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు .