UPDATES  

 ఏవిటి బాండ్ సంస్థ మిర్చి రైతుల పాలిట శాపంగా మారింది…బహుళ జాతి కంపెనీల ప్రతినిధుల సహాయంతో మిర్చి కొనుగోలు నిలిపివేత చేశారని రైతులు ఆవేదన..

  • ఏవిటి బాండ్ సంస్థ మిర్చి రైతుల పాలిట శాపంగా మారింది.
  •  బహుళ జాతి కంపెనీల ప్రతినిధుల సహాయంతో మిర్చి కొనుగోలు నిలిపివేత చేశారని రైతులు ఆవేదన .
  • ట్రయల్స్ అయినా మిర్చి బస్తాలను నిలిపివేశారనీ, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
  • ఏజెన్సీ ప్రాంతంలో మిర్చి ఏవిటి బహుళ జాతి కంపెనీల లైసెన్సులు, పర్మిషన్ రద్దు చేయాలి.

మన్యం న్యూస్ వాజేడు

 

ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, చండ్రుపట్ల గ్రామాలలో మిర్చి ఏవీటి బాండ్ బహుళ జాతి కంపెనీలు రైతులకు అండగా ఉంటానని, కల్లబొల్లి మాటలు చెప్పి రైతులు ఏవిటి బాండు సీడ్స్ ఇచ్చి పంట పెట్టించారు.అనంతరం నుండి కంపెనీ చెప్పిన పెట్టి సైడ్స్, కంపెనీ చెప్పిన ఎరువు మందులు పిచికారి చేయాలని కంపెనీ నిబంధనలు పాటించాలని అనేక అంశాలలో రైతులను ఇబ్బంది పెడుతూ మిర్చి పంట చివరి దశలో మిర్చి కోసి ఒప్పంద పద్ధతిన టెస్టులు పాసై నాకా లారీ లోడ్ చేసే టైంలో మీ మిర్చి బస్తాలను కొనమని చెప్పి బహుళ జాతి ఏవీటి కంపెనీలు రైతుల కష్టాన్ని కన్నీళ్ళని దోచుకొని రైతుల ఆత్మహత్యలకు ఆకలి చావులకు కారకులవుతున్న బహుళ జాతి కంపెనీలను ఏజెన్సీ ప్రాంతం నుండి తరిమి కొట్టాలని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

 

తక్షణమే ప్రభుత్వం స్పందించి బహుళ జాతి కంపెనీల నుండి మిర్చి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బహుళ జాతి కంపెనీలకు షెడ్యూల్ ప్రాంతంలో పర్మిషన్ , లైసెన్సులో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

ఏజెన్సీ ప్రాంతంలో నిరక్షరాస్య రైతులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ బహుళ జాతి కంపెనీలకు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది.

 

బహుళ జాతి కంపెనీలు గంగలో పోసిన పన్నీరులాగా చేస్తూ రైతుల ఆకలి చావులకు ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ బహుళ జాతి కంపెనీలను ఏజెన్సీ ప్రాంతం నుండి వెలయాలని రైతులు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !