రాజకీయరంగ ప్రవేశంపై నటి ఊర్వశీ రౌతేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెను.. “మీకు రాజకీయాలపై అవగాహన ఉందా?” అని విలేకరి ప్రశ్నించారు. దీనికి ఊర్వశీ బదులిస్తూ.. ‘నాకు ఇప్పటికే టికెట్ ఆఫర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? నిర్ణయించుకునే హక్కు ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. కాబట్టి, అభిమానులు ఏది చెబితే అది ఫాలో అవుతా.” అని వ్యాఖ్యానించారు.