మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-మానుషి చిల్లర్ జంటగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈనెల 29న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు రాగా.. ఈరోజు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షమైంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 1న విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.