UPDATES  

 సమ్మక్క సారాలమ్మల రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛమైన కారంపొడి తయారీ…

మన్యం న్యూస్, మంగపేట.

హెచ్డిఎఫ్సి సహకారంతో సమ్మక్క సారలమ్మల రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని స్థాపించారు.ఈ కార్యక్రమం ఏటూర్ నాగారం శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగింది ఉత్పత్తిదారుల సంఘము కారంపొడి మిల్లును స్థాపించారు. ఈ కారంపొడిలో గ్రామ గ్రామాల్లో విస్తరించడానికి ఏటూరు నాగారంలో కారం కొనుగోలుదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి దుకాణపు దారులు సూపర్ మార్కెట్ యజమానులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బాల మహేందర్ స్వాగతం పలికి సమావేశాన్ని వివరించారు. ముఖ్యఅతిథిగా సంహిత రెడ్డి, నాచురల్ కారం పొడి మీకు ఆరోగ్యం మీకు ఆరోగ్యం బాగా ఉంటది, పల్లెటూరు కారం అని వివరించారు.విశిష్టత మరియు ప్రత్యేక లక్షణాల గురించి వివరించారు ప్రాజెక్టు మేనేజర్ చిన్నప్ప రెడ్డి కారంపొడి ఏవిఎస్ కారంపొడి గురించి నెల్లూరు వ్యాపారం గురించి వివరించారు. దీనికి అందరూ గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.ఈ కారంపొడి గురించి ప్రచారం చేసి మార్కెటింగ్ చేసి సమ్మక్క సారలమ్మల రైతు ఉపాధి లాభాల బాటలో నడిపించాలని కోరారు.సమావేశానికి గ్రామ కోఆర్డినేటర్లు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !