సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘సూర్య 44’ పేరుతో రాబోతున్న ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు మేకర్స్ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అంతేకాకుండా స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక, ఈ మూవీని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది.