మన్యం న్యూస్ మంగపేట.
మహనీయుల మాసోత్సవంలో భాగంగా ఏప్రిల్ 2 నుండి 8 వరకు జాతీయ మాల మహా నాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి పిలుపునిచ్చారు.ఈ సంద ర్బంగా మాట్లాడుతు ఎస్సి వర్గీకరణ పేరుతో అన్న దమ్ముల కలిసి ఉంటున్న దళిత సోదరుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి విభేదాలు సృష్టిస్తూ విడదీసె ప్రయత్నం కేంద్ర బీజేపీ పార్టీ చేస్తుందని ఎస్సి వర్గీకరణ పేరుతో మా దళితుల మధ్య చిచ్చు పెడితె వచ్చే ఎన్నికలలో మా సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అలాగే న్యాయం స్వేచ్చ సమానత్వం సౌబ్రాతృత్వాలు మూల స్తంభాలుగా మన భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందిస్తే నేడు కేంద్ర ప్రభుత్వ పాలనాలో మౌలిక సూత్రాల పునాదులు ధ్వంసం అవుతున్నాయని వాటి పరిరక్షణ కోసం జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజ్యాంగ రక్షణ ముగింపు యాత్ర ఏప్రిల్ 8 బొమ్మక్ బాలయ్య గార్డెన్ బోడుప్పల్ జరుగుతుందని దళిత సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి కోరారు.