UPDATES  

 నేటి విద్యార్థులే రేపటి ప్రపంచ మార్గ దర్శకులు.–;.యుగంధర్…

మన్యం న్యూస్ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారం యందు శ్రీ చైతన్య పాఠశాలలో బుధవారం సంబరాలు అంబరాన్ని అంటాయి.ముందు గా స్కూల్ ప్రిన్సిపాల్ యుగందర్ జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్బంగా విద్యార్థులచే నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఐదవ తరగతి చదువుతున్న లక్ష్మీ సునయన క్లాసికల్ డాన్స్ ప్రదర్శించింది.ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ యుగందర్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో మూడు దశలు ఉంటాయని, పి పి టి, ప్రైమరీ హై స్కూల్ అవి చాలా కీలకమైన దశలని విద్యార్థులు ఆ స్థాయిలో వారి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని తెలియజేశారు.ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ఎదుగుతూ దిన దినాభివృద్ధి చెందుతూ వారి జీవితాలకు పూలబాట వేసుకోవాలని అందుకు శ్రీ చైతన్య ఎప్పుడు విద్యార్థులని వెన్నంటి ఉంటుందని తెలియజేశారు. చైతన్య అకాడమిక్ డీన్ నరేష్ ఇంచార్జి భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ నేటి విద్యార్థులు భావి భారత శాస్త్ర వేత్తలు, నాయకులు, విధాతలు, మీరే దేశానికి దిశ నిర్దేశం చేయాలనీ, అన్ని రంగాల్లో రాణించాలని సూచనలు చేశారు. తదనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పత్రాలు ప్రిన్సిపాల్ అందజేశారు. ఈ కార్యక్రమం లో ప్రైమరీ ఇంచార్జ్ నస్రీన్,పి పి టి ఇంచార్జ్ వెంకటరమణ,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !