ఫ్యామిలీ స్టార్’ మూవీ విషయంలో టార్గెట్ రీచ్ అయ్యామని నిర్మాత దిల్ రాజు అన్నారు. మీడియా నుంచి రివ్యూస్ ఒకలా ఉన్నాయని.. కుటుంబ ప్రేక్షకుల నుంచి టాక్ వేరేలా ఉందన్నారు. వారిలో 90శాతం మందికి ఫ్యామిలీ స్టార్ మూవీ నచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని సినిమా తీసినట్లు చెప్పారు. కుటుంబాన్ని గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్‌ని గుర్తించి కలవనున్నట్లు తెలిపారు.
