UPDATES  

 బోడ శ్రీను మృతిదేహాన్ని చూసి బోరున విలపించిన జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి…

మన్యం న్యూస్ మంగపేట.

మంగపేట మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ సోషల్ మీడియా ఇంచార్జ్ బొడ శ్రీను ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో హాస్పటల్లో చాలా రోజులు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు.ఈ విషయం తెలుసుకున్న జడ్పి చైర్మన్ బడే నాగజ్యోతి వారి స్వగృహమైన చుంచుపల్లి గ్రామంలో బోడ శ్రీను మృతదేహం చూసి కన్నీటి పర్యంతం అయ్యారు, ఆ దుఃఖం తోనే పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఇది తీరని దుఃఖం, ఇటువంటి అప్పుడు ధైర్యం గా ఉండాలని,పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

జడ్పి చైర్మన్ తో పాటు నివాళులు అర్పిoచిన వారు,మండల నాయకులు ,చల్లగురుగుల తిరుపతి,నిమ్మగడ్డ ప్రవీణ్, రాజమల్ల సుకుమార్, కర్రీ శ్రీను,మోదుగు బాబు,,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, గందం కిషోర్, పూజారి రాజు,మూగల రాము, రాము , తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !