మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా రెండోసారి మంచు విష్ణు ఎన్నికయ్యారు. 26 మంది కమిటీ సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఎన్నికలు లేకుండానే ఆయన రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఐదేళ్ల వరకు ఒక్కరే అధ్యక్షుడిగా ఒక్కరే కొనసాగడం మా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా మంచు విష్ణుకు సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
