ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ పంచుకున్నారు. ‘హాలీవుడ్లో ఆదరణ సొంతం చేసుకున్న ఓ చిత్రాన్ని తెలుగులో చేద్దామా? అని కొన్నేళ్ల క్రితం ప్రభాస్ అడిగారు. నేను ఒరిజినల్ కథే చేద్దామని చెప్పా. యానిమల్ షూట్లో ఉన్నప్పుడు వచ్చిన ఐడియాను ప్రభాస్‌కు చెప్పా.. ఒకే అన్నారు’ అని తెలిపారు.
