- చాపల మార్కెట్లో దంపులాట.
- దంపులాట కాస్త మర్డర్ కు దారి తీసిన వైనం.
- సొంత బాబాయ్ పై హత్యాయత్నం.
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండలం కేంద్రంలోని చాపల మార్కెట్ దారిలో కోల వంశి అనే యువకుడు 25. చేపల వ్యాపారి. ఇదే గ్రామానికి చెందిన చిన్న అనే మరొక చాపల వ్యాపారి( తన బాబాయి),తో వ్యాపారంలో అవకతవకలు రాగా , ఎవరు లేని సమయంలో తన బాబాయిపై ఘర్షణకు దిగి
దంపులాటకు దారి తీసిన నేపద్యంలో కోపం పట్టలేక చాపలు కొట్టే కత్తితోనే తన బాబాయి పై వేటు వేశాడు. కోపం ఉధృతం అవడంతో విచక్షణ రహితంగా తన బాబాయి పై విరుచుకుపడుతున్న నేపద్యంలో చుట్టూ ఇరుగుపొరుగున్న వారు స్పందించి సకాలంలో తన దగ్గర ఉన్న కత్తిని లాక్కొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి గాయపడిన చిన్నాను హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించారు. గాయాలు బలంగా తగలడంతో బాగా విషమంగా ఉన్న నేపద్యంలో మెరుగైన వైద్యం కోసం నాగారం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
దీనంతటికీ కారణం పాత కక్షలు అని తెలుస్తోంది.