- రాజ్యాంగ నిర్మాతకు దండవేయనోళ్లు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా
- బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండిసంక్షేమాన్ని ఆదరించండి
- జిల్లాలు ఉండాలంటే బిఆర్ఎస్ కే ఓటు వేయండి
- మాజీఎమ్మెల్యే రేగాకాంతరావు
మన్యం న్యూస్ గుండాల: రాజ్యాంగ నిర్మాతకు దండ వేయని వాళ్లు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా అని బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను కుదించాలని ఆలోచనతో రోజుకో ప్రకటన చేస్తుందని ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న జిల్లాలు యధాతధిగా కొనసాగాలంటే బీఆర్ఎస్ ఎంపీ ని గెలిపించాలని అన్నారు. ఆదివారం గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేశారని మరోసారి ప్రజలను మోసం చేయడం కోసం రేవంత్ రెడ్డి పూనుకున్నారని ఆరోపించారు. పాలన పట్ల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇతరులపై నిందిస్తూ పబ్బం గడుపుతున్నాయన్నారు. 6 గ్యారంటీ అమలు లో చిత్తశుద్ధి లోపించింది అన్నారు. సంక్షేమ పథకాలు ఆరు నెలలు వస్తున్న అమలు చేయడం లేదని పెన్షన్లు అమలు కావడం లేదని కళ్యాణ లక్ష్మి అమలు కావడం లేదని వైద్యానికి అందించే సీఎంఆర్ఎఫ్ అమలు కావడం లేదని ఆరోపించారు సంక్షేమరంగాన్ని నీరు కార్చి తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేసి గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకొని ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మొహబ్బత్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి కవితకు అత్యధిక మెజార్టీ చేకూర్చి గెలిపించాలని కోరారు. సంక్షేమం బిఆర్ఎస్ వల్లనే సాధ్యమవుతుందని. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు అనేక సంక్షేమ పథకాలు పేదవాడికి అందాయని ఆరు నెలలు గడుస్తున్న సంక్షేమం అందడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను మోయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు. కోలేటి భవాని శంకర్. వట్టం రాంబాబు. తెల్లం భాస్కర్. తిరకవల్లురి రామ్మూర్తి. గడ్డం వీరన్న. గడ్డం రమేష్. నిట్ట రాములు, తాటి కృష్ణ, లక్ష్మీనారాయణ, రాంబాబు, సుధాకర్, ప్రభాకర్, సుధాకర్, మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు