- మతోన్మాది ఫాసిస్ట్ బిజెపిని ఓడించండి
- -ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
- -సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కెచ్చేల రంగారెడ్డి
మన్యం న్యూస్, దమ్మపేట, మే, 07: దమ్మపేట మండలం, జమేదారు బంజర్ గ్రామంలో సిపిఐ మాస్ లైన్ మండల స్థాయి కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం జిల్లా నాయకురాలు తోడం దుర్గమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కేచ్చేల రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమరలపూడి రాము లు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పాలిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం తాను ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని వారు అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, ఉపాధి కల్పన, విదేశాల నుంచి 75 లక్షల కోట్ల నల్లధనం రప్పించి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతా లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి ప్రచారం చేసిందన్నారు. ఆచరణలో అమలు చేయలేదని వారు విమర్శించారు. పెరుగుతున్న ధరలును నియంత్రించడంలో, ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు, విద్యా, వైద్యం లాంటి హామీలు అమలు చేయలేదని వారు అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు ఏర్పరిచి దేశాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు మతాన్ని రాజ్యగం లోకి చుపిస్తూ ఎన్ఆర్సి, ఎన్టీఆర్, సిఏఏ, చట్టాలు అమల పేరిట ముస్లిం, మైనారిటీలు పౌరసత్వ సమస్యగా మార్చారని మైనార్టీల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా పరిపాలన కొనసాగించాలని, ఏం తినాలో, ఏ బట్ట కట్టాలో, ఎవరితో ఉండాలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే శాసిస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో పాసిస్ట్ బిజెపి ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ శక్తులను ఓడించి సమీప ప్రత్యర్ధులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము, జిల్లా నాయకురాలు తోడు దుర్గమ్మ, మండల నాయకులు, బండి ఆదినారాయణ, వగ్గేల ప్రసాద్, తెల్లం నగేష్, కొండ్రు లక్ష్మి, సున్నం జగన్, సున్నం క్రిష్టారావు, ఏఐపికెఎస్ నాయకులు పండూరి వీరబాబు తాటి సత్యం, తామా రాముడు, కాకా రమేష్, కుంజా కాంతారావు, చాపా ముత్యాలరావు, కేసరి వెంకటేష్, వాడే జోగారావు, బొంత కుమార్, ఆకుల ప్రసాద్ జుజునూరి ముక్తేశ్వరి, గంగాధర నాగమణి, వూకే మహేష్, కాక లక్ష్మడు, బొగ్గం మల్లికార్జున్, సున్ను రాజు తదితరులు పాల్గొన్నారు.