UPDATES  

 ఏటూరు నాగారంలో మద్యం జోరు…బీర్లు పొంగిస్తున్న బెల్ట్ షాపులు…ఎక్సైజ్ ఆఫీసుకు కూత వేటు దూరంలో భారీ విక్రయాలు…

  • ఏటూరు నాగారంలో మద్యం జోరు.
  • బీర్లు పొంగిస్తున్న బెల్ట్ షాపులు.
  •  ఎక్సైజ్ ఆఫీసుకు కూత వేటు దూరంలో భారీ విక్రయాలు.
  •  లంచానికి మంచం వేసినట్టుగా ఎక్సైజ్ సీఐ పని తీరు.
  •  ఎన్నికల కోడ్ ఊసే లేదు.
  •  నిఘా వాహనం జాడ లేదు.
  •  కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకుంటాం అంటున్న నిఘా వాహనoఆఫీసర్లు.

మన్యం న్యూస్ ఎటురు నాగారం

ములుగు జిల్లా ఎటురునాగారం మండలం కేంద్రంలోని వైన్ షాపుల నేత్రుత్వంలో బెల్ట్ షాపులలో భారీగా విక్రయాలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి విక్రయదారులు విక్రయాలకు పాల్పడుతూ అధిక ధరలతో మండల ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఈ అధిక ధరల పట్ల అడిగితే వారిని బెదిరిస్తున్న పరిస్థితులు ఏటూర్ నాగారం కేంద్రంలో సర్వసాధారణమని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతున్న న్నప్పటికీ పొరపాటున ఎక్సైజ్ సిఐ బృందం బెల్ట్ షాపుల వైపు కన్నెత్తయిన చూడని పరిస్థితులు పలు అనుమానాలకు

తావి నిస్తున్నాయి అన్నట్టుగా వారి వైఖరి. అందవైకల్యంతో కూడినట్టుగా ఉందని మండల ప్రజలు వారిపై ధ్వజమెత్తుతున్నారు. ఎక్సైజ్ ఆఫీసుకు కూత వేటు దూరంలో ఐటిడి ఏ ఆఫీసు దారిలో ఒక బెల్ట్ షాపు దాని ఎదురుగా మరొకషాపు. ఎక్సైజ్ కార్యాలయం చుట్టే 8 షాపులు ఉన్నాయంటే అధికారులు పర్యవేక్షణ ఉన్నట్టా లేనట్టా?

లేదా వారి దగ్గర ముడుపులకు తలవగ్గి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారా అని మండల ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా

గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు వెళ్లే దారిలో వై జంక్షన్ వద్ద మూల టర్నింగ్ మీద ఉన్న బెల్ట్ షాపు కూడా ఎక్సైజ్ అధికారులకు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని మండల ప్రజలు వాపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఎటునాగారం కేంద్రంలో 200 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే. దాని అర్థం ఏమిటి.? వీధి వీధికి రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి, అంటే అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మందు తాగి యువత అర్థంతరంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటే వారికి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ ఎందుకు మౌనం పాటిస్తుంది.?ఒక పత్రికా విలేఖరి జరుగుతున్న బెల్ట్ విక్రయాలను దగ్గరండి చూపించినా కూడా తూతూ మంత్రంగా వెతికి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.?

భయం లేని వారి వ్యాపారానికి ఎక్సైజ్ అధికారులే కొమ్ము కాస్తూ ఉన్నారని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా

ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ ఎలక్షన్ల నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోకుండా ఎటువంటి మద్యం అమ్మకాలు జరగకుండా ఈసీ నియమించిన నిఘా వాహనం జాడ కూడా లేకపోవడం కంచె చేలు మేసిన వ్యవహారంగా ఉంది అంటూ పరోక్షంగా మండలంలో పలు శాఖలు మద్యం విక్రయాలకు పల్లకి మోస్తున్నారు అని మండల ప్రజలు వారి తీరుపై మండిపడుతున్నారు . చూపరానికే నిగా వాహనం అన్నట్టుగా ఆ వాహనం పొద్దున ఒక గంట సేపు కనబడుతుంది అని ఆపై ఎటు పోతుందో ఊర్లో మాత్రం అసలు కనపడదని తద్వారా మధ్యo అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక నే బెల్ట్ విక్రయదారులు ఇచ్చే పైసల కోసమే ఈ విధంగా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారా.?

లేక నిజంగానే వారి దగ్గర ఏమీ దొరకడం లేదో?

ఆ మేడారం సమ్మక్క సారక్కకే తెలియాలి అంటూ వ్యంగ్యంగా ప్రజలు వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల పట్టింపు లేకపోవడంతోఇదే అదునుగా భావించిన

విక్రయదారులు. విచ్చలవిడిగా చెలరేగుతూ వారి విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు.గట్టిగా అడిగితే సిఐ గారికి మాకు చాలా పొత్తులు ఉన్నాయి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెల్ట్ షాపు నిర్వాహకులు ఎదురు దాడికి. దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. . దీని అద్దం పట్టేలా రెండు రోజుల క్రితం నాగారం కేంద్రంలోని ఒక పత్రిక విలేకరి దగ్గరుండి బెల్ట్ షాపుని ఎక్సైజ్ అధికారులకు చూపించినా కూడా ఎక్సైజ్ సీఐ వచ్చితూతూ మంత్రంగా వారి బృందం వ్యవహరించారని, ఏదో పైపైన వెతికినట్టు వెతికి ఏమీ లేదు అని చెప్పి వెళ్లిపోయిన తీరు పలు అనుమానాలకు తావిని ఇస్తున్నాయనివారు తెలిపారు. ఏది ఏమైనా ఈ విచ్చలవిడి వ్యాపారం పట్ల నాగరంలో జరిగే బెల్ట్ షాపులను నియంత్రించే విధంగా ఫెయిల్ అయిన ఎక్సైజ్ శాఖ అధికారులను విధుల్లోంచి తొలగించి కొత్త అధికారులు నియమించాలని ఈ మందు రాక్కసిని ఈ పల్లెలో నుంచి తరిమి వేసే దిశగా అడుగులు వేసే విధంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు చేపట్టాలని మండల ప్రజలు పత్రికాముఖంగా కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !