జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కర్-ఏ-తోయిబాతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టీఆర్ఎఫ్ కమాండర్ ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
హతమైన ఉగ్రవాది టీఆర్ఎఫ్ కమాండర్ బాసిత్ అహ్మద్ దార్ అని, అతను ఏప్రిల్ 25, 2021 నుంచి యాక్టివ్‌గా ఉన్నాడు. అతను భద్రతా బలగాలపై, పౌర హత్యలపై అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడని ఉన్నతస్థాయి భద్రతా అధికారులు వెల్లడించారు. బాసిత్ అహ్మద్ దార్ మీద పది లక్షల రివార్డు ఉంది.
ఎన్కౌంటర్ స్థలంలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ ప్రదేశానికి అదనపు మోహరింపును తీసుకువచ్చారు. భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి.
కాశ్మీర్‌లోని కుల్గామ్ రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి ముందగా భద్రతా దళాలు సోమవారం సమాచారం అందుకున్నాయి. దీంతో అర్థరాత్రి కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సెర్చ్ ఆపరేషన్ మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
మే 1, ఏప్రిల్ 28న ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో గ్రామ రక్షణ గార్డు (VDG) మరణించిన తర్వాత రెండు గ్రూపుల ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా సంస్థలు కథువా జిల్లాకు సెర్చ్ ఆపరేషన్ పరిధిని విస్తరించాయి.