UPDATES  

 అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం..

హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు 46వ అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశానికి లాంఛనంగా సమాచారం ఇవ్వనుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ కమిటీ 26వ సమావేశానికి తెలియజేయనుంది. ఈనెల 20 నుంచి 30 వరకూ కోచిలో ఈ రెండు భేటీలు జరుగుతాయి. ప్రస్తుతం భారత్‌కు అంటార్కిటికాలో మైత్రి, భారతి అనే రెండు పరిశోధన కేంద్రాలున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !