- రాష్ట్ర సంక్షేమం బిఆర్ఎస్ కే సాధ్యం
- ప్రజలు కేసిఆర్ వెంట ఉన్నారు
- బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
- ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
- ఆడంగా ఉంటా ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత
మన్యం న్యూస్ గుండాల: రాష్ట్ర సంక్షేమం టిఆర్ఎస్ పార్టీకే సాధ్యమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం గుండాల మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవితతో కలిసి పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని అన్నారు.,ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడుతూ.ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు.కాంగ్రెస్ చేసిన హామీలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు కేసిఆర్ వెంట ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జీ భవానీ శంకర్,మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ఆళ్లపల్లి మండల ఇంచార్జ్ వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీను,రవీందర్ రెడ్డి,టి.రాము, అటికం నాగేశ్వరరావు, గడ్డం వీరన్న,జనగం నరసింహారావు, జాడి ప్రభాకర్, కుంజ నాగేశ్వరరావు, సుతారి సత్యం,గుడ్ల రంజిత్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.