UPDATES  

 కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రీతి ముఖుందన్ నటిస్తుంది.

 

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అన్ని ఇండస్ట్రీల హీరోలు నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, శివన్న.. ఇలా అతిరథ మహారధులు నటిస్తున్నారు. ఇప్పటికే శివుని పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు తెలిసిపోయింది. మొదటి నుంచి శివుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ శివుని పాత్రలో కాకుండా నందీశ్వరుడుగా ప్రభాస్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.

 

ఇక తాజాగా ప్రభాస్.. కన్నప్ప సెట్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ప్రభాస్ కాలును చూపిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానికి విష్ణు ఒక మంచి క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. మై బ్రదర్ ప్రభాస్ కన్నప్ప సెట్ లో అడుగుపెట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ చాలా తక్కువ సమయమే కనిపించనున్నాడట. మంచు విష్ణు మీద ఉన్న అభిమానంతో డార్లింగ్ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అన్ని భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !