కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ఎన్నికల అధికారులు షాకిచ్చారు. సోమవారం పోలింగ్ కొనసాగుతుండగా 4వ నంబర్ కలిగిన టీ షర్ట్‌ను ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ వెలిచాల పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీంతో బీజేపీ కరీంగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులు విచారణ జరిపిన అనంతరం రాజేందర్ రావుపై కేసు నమోదు చేశారు.