టీమిండియా కొత్త కోచ్ ఎవరు? ఇండియాకి చెందిన మాజీ ఆటగాడా? లేక ఫారెన్ కోచ్‌ని ఎంపిక చేస్తుందా? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. మెజార్టీ మాజీ ఆటగాళ్లు మాత్రం ఇండియా వ్యక్తి అయితే బాగుంటుందని అంటున్నారు. ఎందుకు కారణాలు లేకపోలేదు.
ఐపీఎల్ పుణ్యమాని విదేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు వివిధ జట్లకు కోచ్‌గా ఉన్నారు. వాళ్ల సలహాలు యువ క్రికెటర్లకు బాగానే కలిసి వస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ఫారెన్ కోచ్‌ను తీసుకోవడం, ఇక్కడి పరిస్థితులకు వచ్చే వ్యక్తి సెట్ అయ్యేసరికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. లేకపోతే రాహల్ ద్రావిడ్ కంటిన్యూ చేస్తే బాగుంటందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా టీమిండియా కొత్త కోచ్ కోసం వేట మొదలుపెట్టింది బీసీసీఐ. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చేసింది. దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు మే 27 చివరి తేది. నోటిఫికేషన్లో కోచ్ అర్హతకు సంబంధించిన కొన్ని నిబంధనలను వెల్లడించింది. కోచ్ వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలన్నది ఒకటి. కనీసం 30 టెస్టులు, 50 వన్డేలు ఆడి ఉండాలన్నది మరో రూల్. అంతేకాదు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టుకు కనీసం రెండేళ్లపాటు అందులో సభ్యుడి ఉండాలన్నది మరొకటి.