UPDATES  

 చమటలు పట్టించాం.. బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే రేవంత్ ఎక్కువ కష్టపడ్డారన్న కేటీఆర్..

ఈ లోక్‌సభ ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే హ‌వా కొన‌సాగించ‌బోతున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇండియా, ఎన్డీఏ కూట‌మిల‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే పరిస్థితి లేదన్నారు. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్సరళిపై రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

 

రాష్ట్రంలో బీజేపీ – కాంగ్రెస్పార్టీల వైఖరి ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి.. రేవంత్రెడ్డి కమలనాథులకు సహకరించారని, ఆ పార్టీని గెలిపించడానికి కిషన్‌ రెడ్డి కంటే, రేవంత్‌ రెడ్డే ఎక్కువగా కష్టపడ్డారని విమర్శించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భారత రాష్ట్ర సమితి(BRS)కి మద్దతుగా నిలిచారని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా వేయనందుకు కాంగ్రెస్‌పై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రుణమాఫీ విషయంలో మోసం చేశారని అన్నదాతలు మండిపడుతున్నారన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

 

నెలకు రూ.2500 ఇవ్వలేదని రాష్ట్రంలోని మహిళలు కూడా కాంగ్రెస్ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. మరోవైపు, బీజేపీపైనా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు .పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు పెరిగినందుకు మోడీపై కోపంతో ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదన్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు.

 

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు చేసినా.. ఆయన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. బీఆర్ఎస్ఈసారి సగం సీట్లు బీసీ కులాలకు కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. రెండు జాతీయ పార్టీలకు తమ పార్టీ ముచ్చెమటలు పట్టించిందన్నారు కేటీఆర్. మూడు పార్టీల్లో తమకే అధిక ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అద్భుతంగా కృషి చేశారని కొనియడారు. పార్టీ శ్రేణుల కష్టం వృథాగా పోదని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు మంచి ఫలితం ఉంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

 

పార్లమెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి అయితే ప‌రిస్థితి బాగుండ‌దని అన్నారు. ఈ ఐదు నెల‌ల్లోనే ఎక్క‌డ లేని వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఐదు నెల‌ల్లోనే అసాధార‌ణ వ్య‌తిరేక‌త వ‌చ్చింది. క్షేత్ర స్థాయిలో బాగాలేదు. అడ్డ‌గోలు హామీలిచ్చి నెర‌వేర్చ‌లేద‌నే కోపంతో ప్ర‌జ‌లు ఉన్న‌ట్లు ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. ఈ ఎన్నిక‌ల త‌ర్వాతనైనా కాంగ్రెస్ బుద్ది తెచ్చుకొని 420 హామీలు అమ‌లు చేయ‌క‌పోతే ప్ర‌జాక్షేత్రంలో ప‌రాభ‌వం త‌ప్పదని కేటీఆర్ హెచ్చ‌రించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !