గతేడాది అమెరికాలోని అధ్యక్ష కార్యాలయంపై భారత సంతతికి చెందిన సాయి వర్షిత్ కందుల(20)(హైదరాబాద్) దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. అతడు తాజాగా కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. గతేడాది మిస్సౌరీ నుంచి వాషింగ్టన్ డీసీ చేరుకున్న వర్షిత్ ఒక ట్రక్కుని అద్దెకు తీసుకుని సరాసరి వైట్ హౌస్లోకి దూసుకెళ్లేందుకు యత్నించి దొరికిపోయాడు. అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఇలా చేశానంటూ వర్షిత్ విచారణలో చెప్పినట్లు సమాచారం.