- క్రీడలు మానసిక ఉల్లాసాన్ని స్నేహబంధాన్ని పెంపొందిస్తాయి.. ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావ్
- కొమురం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ విజేత బండి రేవు జట్టు..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని స్నేహబంధాన్ని పెంపొందిస్తాయని ఏజెన్సీలోని క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎదగాలని భద్రాచలం ఎమ్మెల్యే డా.తెల్లం వెంకటరావు అన్నారు. మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలో నిర్వహించిన కొమురం భీం క్రీకెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్యఅతిథిగా పాల్గొని సోమవారం బహుమతులు అందజేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి పాలైన వారు నిరుత్సాహపడకుండా మరోసారి గెలుపుకోసం ప్రయత్నించాలన్నారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదిగేలా కృషిచేయాలన్నారు. గోవిందపురంలో లో పదిహేను రోజుల నుంచి క్రీడలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల్లో స్నేహసంబంధాలు పెరిగి యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండడానికి దోహదపడతాయన్నారు. ఈ మండుటెండలో ఎంతో సౌకర్యమంతంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహ కమిటీ సభ్యుడు తెల్లం హరికృష్ణ ను ప్రత్యేకంగా అభినందించారు.క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎల్లవేళలా తమవంతు కృషిచేస్తామని వారు పేర్కొన్నారు.ఈ పోటీల్లో గెలుపొందిన బండిరేవు రఘు జట్టుకు మొదటి బహుమతిగా రూ.30వేలు, షీల్డ్, కొత్తూరు జట్టుకు రెండవ బహుమతిగా రూ.20వేలు, దేవరపల్లి జట్టుకు రూ .15 వేలు, నాలుగవ బహుమతి పెద్ద బండి రేవు జట్టుకు రూ.10వేలు షీల్డ్ అందజేశారు. ఈటోర్నీలో ప్రతిభకనబర్చిన క్రీడాకారులను ప్రత్యేకబహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఎంపీపీ రేసు లక్ష్మి ఎంపీటీసీ భీమరాజు మాజీ సర్పంచ్ వరలక్ష్మి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరమాచినేని వినిల్ మాజీ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు సేవాదళ్ అధ్యక్షులు వెంకటరమణారెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ అధ్యక్షులు కొమరం దామోదర్ రావు దర్శి సాంబశివరావు కనుబుద్ధి దేవా, తోట రమేష్, , కృష్ణ,సరీయం వీర్రాజు, కపుల నాగరాజు, నిర్వహణ కమిటీ సభ్యులు తెల్లం హరికృష్ణ శ్రీధర్ జానీ వెంకట్ దాసు చింతం రమేష్ తదితరులు పాల్గొన్నారు.