మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
మానవత్వం చాటుకున్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి తను ప్రాథమిక చికిత్సను అందించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని వర్క్ షాప్ గ్రామ మలుపు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో యువకుడికి గాయమైంది ఆ సమయంలోనే అటువైపుగా దుమ్ముగూడెం గ్రామానికి కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట్రావు హుటాహుటిన కారు దిగి గాయపడిన యువకుడికి నీరు అందించి ,ప్రాథమిక చికిత్స అందించారు అనంతరం తను కాలుకైన గాయానికి మెరుగైన వైద్యం కోసం తన హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే హాస్పిటల్ ఫోన్ చేసి యువకుడికి చికిత్స అందించాలని అన్నారు.కష్ట కాలంలో ఎమ్మెల్యే తన గొప్ప మనసును చాటుకున్నారు.