UPDATES  

 బెంగుళూరు రేవ్ పార్టీ.. ముగ్గురు పోలీసులపై వేటు..

బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు దొరికిన నిందితులపై దృష్టి పెట్టారు పోలీసులు. తాజాగా జీఆర్ ఫామ్‌హౌస్‌‌కి సమీపంలో ఉన్న పోలీస్టుస్టేషన్‌పై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ముగ్గురు పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు.

 

రేవ్ పార్టీ విషయం తెలిసి కూడా విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడంపై ఆ శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలో హెబ్బగోడి స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులపై సస్పెండ్ చేశారు. డ్రగ్స్ తీసుకున్నవారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టెస్టులు నిర్వహించారు. వచ్చిన రిపోర్టు ఆధారంగా వారికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్మినవారు ఎవరు? తీసుకున్నవారెవరు? అనేది అందులో తేలనుంది.

 

ఈ పార్టీకి మొత్తం 150 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ నేతలున్నారు. వీరిలో 105 మంది మాత్రమే పట్టుబడ్డారు. మిగతావారు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. ఈ రేవ్ పార్టీకి సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించారు. పార్టీకి 70 మంది యువకులు, 30 మంది యువతులు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లినట్టు తేలింది.

 

రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తెచ్చారు? ఎంత మొత్తంలో వచ్చాయి? వాటిని సప్లై చేసింది ఎవరు? అనేదానిపై దృష్టి పెట్టారు. మరి పట్టుబడిన వారి సమాచారం సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని బెంగుళూరు పోలీసులు చెబుతున్నమాట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !