తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆర్టీఓ కార్యాలయాల్లో, బోర్డర్ చెక్ పోస్టుల్లో ACB అధికారులు దాడులు చేశారు. నల్లగొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలపై అధికారులు సోదాలు చేశారు. ఆర్టీఓ ఏజెంట్లను, అధికారులను విచారించారు. మహబూబ్నగర్లో ఐదుగురు ఏజెంట్లను, అశ్వరావుపేటలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
