ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి నెల రోజుల పాటు అదనపు నీటిని అందించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎండల తీవ్రతతో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది.
