మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలోని ప్రగతి విద్యాలయం విద్యార్థులు ఏకలవ్య మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలలో సీట్లు సాధించి సత్తా చాటారు మండల కేంద్రానికి చెందిన శ్రీరంగం లక్ష్మీ ప్రసన్న, ఏకలవ్య పాఠశాలలో సీటు సాధించగా తవిడిశెట్టి నందిత గురుకుల పాఠశాలలో సీటు సాధించింది. మొత్తం విద్యార్థులు 15 మంది సీట్లు సాధించి తమ పాఠశాల సత్తాను మరోమారు నిరూపించారని కరస్పాండెంట్ తాటిపల్లి సత్యం అన్నారు. ఏకలవ్య పాఠశాలలో సీటు సాధించిన లక్ష్మీప్రసన్నను గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అభినందించారు. మా పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏకలవ్య, సైనిక్ స్కూల్, గురుకుల పాఠశాల పరీక్ష కోసం కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తాటిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు, పాల్గొన్నారు
