రవికిరణ్ కోలా దరకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అందమైన ప్రేమకథతో రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించగా, ఆమె సుముఖత తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్, అమరన్ చిత్రాల్లో నటిస్తున్నారు.