మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం పొదుమూరు గ్రామానికి చెందిన ఎండి యాకుబ్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తు, గత రెండు నెలల క్రితం జబ్బోనిగూడెం లో ఆకస్మాత్తుగా ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయారు, అతనికి భార్య రేష్మి ముగ్గురు పిల్లలు ఉన్నారు, భర్త చనిపోయాడని బాధ తట్టుకోలేక భార్య మనస్థాపనీకి గురై చనిపోయారు, ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు ఆ విషయం తెలుసుకున్న
ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి తన పుట్టినరోజు సందర్బంగా వారి కుటుంబంలోని పిల్లలను పరామర్శించి 25 కేజీల బియ్యం, 2 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుండేటి రాజు యాదవ్, ఖరీమ్,ముప్పారావు సందీప్,సాధనపల్లి రవి, శ్రీను, యాకుబ్,గార అరుణ్ కుమార్ తదితరులు హాజరు అయ్యారు.