మన్యం న్యూస్ మంగపేట. మంగపేట మండలం రాజుపేట గ్రామ పంచాయతీ లో ఫ్రైడే డ్రై డే నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ ప్రజలను ఉద్దేశించి మీరు మీ ఇంటి యొక్క పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలని ప్రతి శుక్రవారం తప్పనిసరిగా పారిశుధ్య కార్యక్రమం, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తద్వారా దోమలు, ఈ గలు తదితర క్రిమి కీటకాలను దూరం చేయాలనీ సూచనలు చేశారు. ఇప్పుడు రాబోయే వర్షాకాలం తీవ్ర మైన వ్యాధులు రోగాలు వచ్చే కాలం కాబట్టి మనం శుభ్రంగా ఉండటమే కాకుండా, మన పరిసరాలను కూడా శుభ్రం గా ఉంచుకుంటూ, డెంగీ, మలేరియా, చీకున్ గుణ్యా, కలరా లాంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే పరిసరాల పారిశుధ్య పరిశుభ్రత ముఖ్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమం లో రాజుపేట గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఆశ వర్కర్ విజయ తదితరులు పాల్గొన్నారు.