మన్యం న్యూస్ గుండాల: ఉద్యోగ ఉపాధి హామీ అవకాశాలపై విద్యార్థిలోకం ఉద్యమించాలని అధ్యక్ష కార్యదర్శులు ఉకే శ్రవణ్, పునెం మంగయ్య పిలుపునిచ్చారు. ప్రగతిశీల యువజన సంఘం( పివైఎల్) గుండాల మండల కమిటీ సమావేశం ఆదివారం గుండాల మండల కేంద్రంలోని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పీవైఎల్ గుండాల మండల నూతన అధ్యక్షులుగా వూకే శ్రవణ్,పునేం మంగయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 15 మందితో గుండాల మండల పి వై ఎల్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పీ వై ఎల్ ఇల్లందు డివిజన్ కార్యదర్శి సనప కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగ యువత రోజుకు పెరిగిపోతుందని, పాలకులు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం యువత పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తే సహించబోమని వారు హెచ్చరించారు. వర్షాకాలం సంభవిస్తున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యశాలలను పటిష్టవంతం చేసి, సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండుటకు చర్యలు చేపట్టాలని వారు పేర్కొన్నారు. ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు జులై రెండవ వారంలో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నిర్వహించబోతున్నామని రాజకీయ శిక్షణ తరగతులకు మండలంలోని యువత ఎక్కువ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్తీ సుదర్శన్, కుంజా నరేష్, ధారావత్ మోహన్, గట్టి సురేష్, పూనెం కృష్ణ, వజ్జ ధర్మరాజు ,ఈసం ప్రభాకర్ మోకాళ్ళ పాపారావు,కుంజ రమేష్, కొమరం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
