సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ మూవీ జూన్ 14న రిలీజ్‌కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్లో మహేశ్‌బాబుతో మాట్లాడిన ఫోన్ రికార్డును సుధీర్‌బాబు ప్లే చేశారు. అందులో గన్స్‌ను చూపించిన సినిమాల్లో నీకు నచ్చింది ఏది అని అడగ్గా.. నాన్న నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను వందసార్లు చూశానని.. తనకు చాలా ఇష్టమైన చిత్రమని మహేశ్ చెప్పారు.
