ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. అయితే ఈ సినిమా విడుదల కోసం ఎదురుచున్న అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకురానుంది. సెప్టెంబరు 27న ‘దేవర’ పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేశారు.
