బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సినీ, రాజకీయ జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించడం కష్టమన్నారు. దీంతో పోలిస్తే నటిగా హాయిగా జీవించవచ్చని అభిప్రాయపడ్డారు. ‘మా ముత్తాత గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. దీంతో తొలి చిత్రం గ్యాంగ్స్టర్ తర్వాత రాజకీయాల్లోకి రావాలని సంప్రదించారు. కానీ, సరైన సమయం రావాలని ఎదురుచూశా’ అని చెప్పుకొచ్చారు.
