లండన్‌కు చెందిన ఓ వ్యాపారి తన ఐఫోన్‌లోని ఐ మెసేజ్ యాప్ నుంచి సెక్స్‌వర్కర్లతో చాటింగ్ చేశాడు. భార్యకు ఈ విషయం తెలియొద్దని వాటిని డిలీట్ చేశాడు!. అయితే, ఇదే ఐడీని కుటుంబానికి చెందిన ఐమ్యాక్‌లోనూ ఉపయోగించాడు. ఫోన్లో మెసేజ్‌లు డిలీట్ చేసినా ఐమ్యాక్‌లో అలాగే ఉండిపోయాయి. అది చూసిన భార్య అతనితో విడిపోయింది. దీంతో యాపిల్‌పై రూ.53 కోట్లకు దావా వేశాడు.