తెలంగాణలో టీచర్‌ల ప్రమోషన్‌లకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నా ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2010కి ముందు ఉన్న టీచర్లకు టెట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఉత్వర్వులు జారీచేసిన.. ప్రమోషన్స్ ఎలా చేపడతారని ప్రశ్నించింది. పదోన్నతులకు సంబంధించి ఎలాంటి కొత్త ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.