UPDATES  

 ప్రగళ్ళపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి.. మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్..

మన్యం న్యూస్, దుమ్ముగూడెం జూన్ 19::

ప్రగళ్ళపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వం డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం స్థానంలో జరిగిన నమస్తే రాజకీయ శిక్షణ తరగతులు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్న వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రగల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు కేటాయించడం లేదని ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి ఎన్నికల అయిపోయిన తర్వాత పట్టించుకోవడంలేదని మండిపడ్డారు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని గోదావరి పక్కనే ఉంచుకుని పంటలు ఎండే పరిస్థితి ఉందని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం సకాలంలో ఎరువులు విత్తనాలను అందించాలని ఫెర్టిలైజర్ షాప్స్ లో నకిలీ విత్తనాలను విక్రయించకుండా అగ్రికల్చర్ అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ చంద్రయ్య చిలకమ్మ మండల నాయకులు శ్రీనుబాబు లోకేష్ బాబు సత్యనారాయణ సమ్మక్క ఎండి బెగ్ ఖాదర్ బాబు కొమరం చంటి మాజీ సర్పంచులు తిరుపతిరావు దేవి పార్వతి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !