ఇస్రో మరో ఘనత సాధించింది. స్వయంప్రతిపత్తి సామర్థ్యం కలిగి ఉన్న రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్ప్ పెరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం చివరి పరీక్ష విజయవంతమైంది. ఈ టెక్నాలజీ సిరీస్‌లో మూడో విజయమని ఇస్రో తెలిపింది. ఈ చివరి పరీక్షను కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఉదయం పరీక్షించినట్లు తెలిపింది.
అంతరిక్షంనుంచి వచ్చే వాహక నౌక పనితీరు. ల్యాండింగ్ పరిస్థితులను ఈ ప్రయోగంతో కళ్లకు కట్టినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాహకనౌకల పునరుద్ధరణ దిశగా.. ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్ ప్రయోగాలను ఇస్రో చేపడుతోంది.
‘పుష్పక్’ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ తో 4.5 కిలోమీటర్ల ఎత్తులో విడుదల చేశారు. సెంటర్ లైన్ వద్ద ఖచ్చితమైన క్షితిజ సమాంతర ల్యాండింగ్ అయిందని ఇస్రో తెలిపింది.
ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్ 01, ఎల్ఈఎక్స్ 02 మిషన్ విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు, తీవ్రమైన గాలి పరిస్థితుల్లో చేపట్టినట్లు తెలిపింది. రన్ వూపై ల్యాండ్ కాగానే వాహకనైక వేగం బ్రేక్ పారాచూట్‌తో 100KMPHకు తగ్గిందని ఇస్రో తెలిపింది. అనంతరం ల్యాండింగ్ గేర్లు బయటకు వచ్చి వాహనం పూర్తిగా ఆగిపోయిందని వెల్లడించింది. ఈ నోస్ వీల్ స్టీరింగ్, రడ్డర్ ను ఆర్ఎల్వీ ఉపయోగించినట్లు వెల్లడించింది.