మన్యం న్యూస్ గుండాల
ఆరు నెలలుగా కేతన లేకుండా గ్రామపంచాయతీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వారి వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో సత్యనారాయణకు వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం ఐ ఎఫ్ టి యు కార్యదర్శి వై వెంకన్న మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులను సక్రమంగా నిర్వహిస్తున్న కార్మికుల వేతనాలను ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కనీస వేతనం నెలకు 27 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన హక్కులన్నిటిని కార్మికులకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు కిరణ్, ప్రవీణ్, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు