ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ నిర్మాతలు కలిసిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.
సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరామని, ఖరారు అయిన తర్వాత ఆయన్ను కలుస్తామని తెలిపారు. అప్పుడు అన్నింటికి సంబంధించి రిప్రజంటేషన్ ఇస్తామని చెప్పారు. టికెట్ల రేట్లు చాలా చిన్న విషయమని చెప్పారు.