సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘కల్కీ’ మూవీ హిట్ టాక్‌ను అందుకుంది. కానీ.. మూవీ విడుదలైన కొద్దిసేపటికే ఆన్లైన్లో దర్శనమిస్తోంది. ఈ పరిస్థితి నిర్మాతలను, ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. పైరసీ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
