రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు పవన్ చేరుకోనున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్‌కు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అటు అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.