UPDATES  

 హైదరాబాద్ లో జనాలకి 5జి అందుబాటులోకి తెచ్చిన జియో

దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, వారణాసి, కోల్ కతా, ఢిల్లీ, నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ పట్టణాల్లోని కస్టమర్లు మై జియో యాప్ లో ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 5జీ నెట్ వర్క్ కు కనెక్ట్ కావడానికి అవకాశం ఉందని జియో ప్రకటించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్ టెల్ సైతం హైదరాబాద్ పరిధిలో 5జీ సేవలను ఇప్పటికే ప్రారంభించడం తెలిసిందే.

ఎంపిక చేసిన కస్టమర్లకు అన్ లిమిటెడ్ గా 5జీ డేటాను జియో ప్రస్తుతం ఆఫర్ చేస్తోంది. 4జీని సైతం మొదట్లో ఉచితంగా ఇచ్చి యూజర్లను ఆకర్షించడం తెలిసిందే. జియో యూజర్లకు ఎస్ఎంఎస్ లేదా మైజియో యాప్ లో నోటిఫికేషన్ రూపంలో ఇన్విటేషన్ వస్తుంది. అప్పుడే 5జీ నెట్ వర్క్ కు అనుసంధానం కావడానికి అవకాశం ఉంది.

నోటిఫికేషన్ అందిన తరువాత ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మొబైల్ నెట్ వర్క్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత జియో సిమ్ సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్ ను ట్యాప్ చేయాలి. అక్కడ 3జీ, 4జీ, 5జీ కనిపిస్తాయి. 5జీ నెట్ వర్క్ ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో 5జీ నెట్ వర్క్ కు మీ ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. ప్రస్తుతం భాగ్యనగరం అంతటా 5జీ నెట్ వర్క్ ప్రారంభం అయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !