డిసెంబర్ వచ్చిందంటే చాలు కేక్‌ల సీజన్ వచ్చినట్లే. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో చాలా మంది కేక్లనను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. అయితే ఓ సింపుల్ రెసిపీతో.. మీ కేక్‌ను మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్‌కి ఇంట్లో ఈ కేక్ తయారు చేసుకుని.. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్‌కి, లేదా మీ ఇంట్లోవారి బర్త్‌డేలకు మీరే ఈజీగా ఈ కేక్ తయారు చేసేయవచ్చు. వారి అభిమానం పొందవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * వెన్ – 210 గ్రాములు * బ్రౌన్ షుగర్ – 240 గ్రాములు * అరటిపండ్లు – 150 గ్రాములు (పండినవి) * పాలు – 200 గ్రాములు * ఆల్ పర్పస్ ఫ్లోర్ – 300 గ్రాములు * బాదం – 100 గ్రాములు * గుడ్లు – 3 * బేకింగ్ పౌడర్ – 10 గ్రాములు * దాల్చిన చెక్క పొడి – 2 గ్రాములు తయారీ విధానం.. ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో.. గది ఉష్ణోగ్రత వద్ద.. వెన్నను, చక్కెరను మెత్తగా కలపండి. ఇప్పుడు అరటిపండును బాగా స్మాష్ చేసి.. పాలు కూడా వేసేయండి. అవి బాగా కలిసిన తర్వాత ఆల్ పర్పస్ పిండి, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి వేసి.. ఉండలు లేకుండా బాగా కలపండి. మీ కేక్ మిశ్రమం రెడీ అయిపోయింది. మీరు దీనిని ఓవెన్లో అయినా కుక్ చేయవచ్చు. లేదంటే కుక్కర్ ఉపయోగించి కూడా.. మీరు ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. కుక్ చేయడం పూర్తైన తర్వాత.. ఫ్రెష్ క్రీమ్‌తో డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అలానే తినేయొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే.