UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 ఒకప్పుడు ఆశా సైనీగా టాలీవుడ్‌లో నటించి మెప్పించిన నటి సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు ఆశా సైనీగా టాలీవుడ్‌లో నటించి మెప్పించిన నటి ఫ్లోరా సైనీ. లేటు వయసులో కొన్ని హాట్‌ క్యారెక్టర్లు కూడా పోషించిన ఈ నటి ఇప్పుడు గృహ హింసపై స్పందించింది. తొలిసారి 2018లో మీ టూ ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ తనను హింసించాడని చెప్పింది. ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలోనూ ఆ చేదు అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకుంది. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మరెవరో కాదు సినిమా ప్రొడ్యూసర్‌ గౌరంగ్‌ దోషి. అతని కోసం తాను ఇల్లు వదిలి వచ్చేశానని చెప్పింది. మొదట్లో అతడు చాలా బాగున్నాడని, తన ఇంటివాళ్లు కూడా మోసపోయారని ఫ్లోరా తెలిపింది. ఈ మధ్య జరిగిన శ్రద్ధా వాకర్‌ హత్య గురించి కూడా ఆమె స్పందిస్తూ.. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ ఎలా వేధించాడో చెప్పుకొచ్చింది. “శ్రద్ధా విషయంలోనూ అదే జరిగింది. అలాంటి వాళ్లు మొదట కుటుంబం నుంచి దూరం చేస్తారు. నేను కూడా అతని కోసం ఇల్లు వదిలి వచ్చేశాను. వారం రోజుల్లోనే దెబ్బలు తిన్నాను. సడెన్‌గా నన్ను ఎందుకు కొడుతున్నాడో అర్థం కాలేదు” అని ఆమె న్యూస్‌ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తన పేరెంట్స్‌ వద్దంటున్నా వినకుండా తాను గౌరంగ్‌ కోసం వెళ్లానని తెలిపింది.

“ఒక రోజు నన్ను చాలా దారుణంగా కొట్టాడు. నా దవడ విరిగింది. తన తండ్రి ఫొటో బయటకు తీసి.. నా తండ్రిపై ఒట్టేసి చెబుతున్నా ఇవాళ నిన్ను చంపేస్తా అని బెదిరించాడు. అతడు ఆ ఫొటోను వెనక్కి పెట్టేలోపు మా అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఇలాంటి సమయంలో పారిపోవడమే కరెక్ట్‌ అని. ఒంటిపై బట్టలు ఉన్నాయా లేదా, చేతిలో డబ్బు ఉందా లేదా అనేది చూడకుండా బతికి ఉండటం కోసం పారిపోవాలి అని చెప్పేది. అప్పుడే ఇంటికి వెళ్లిపోయి, తిరిగి అతని దగ్గరికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను” అని ఫ్లోరా చెప్పింది. మరుసటి రోజే తాను అతనిపై పోలీస్‌ కేసు పెట్టడానికి వెళ్లినట్లు కూడా తెలిపింది. అయితే మొదట్లో పోలీసులు అందుకు నిరాకరించినా.. చివరికి తాను రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. రెండు దశాబ్దాల కిందట నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మెరిసిన ఫ్లోరా సైనీ.. హిందీలోనూ లవ్‌ ఇన్‌ నేపాల్‌, దబంగ్‌ 2, ధనక్‌, స్త్రీలాంటి సినిమాల్లో నటించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !